- Advertisement -
– పలు గొర్రెలకు గాయాలు, బాధితుడికి 70 వేల వరకు నష్టం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ గ్రామంలో గురువారం గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో రెండు గొర్రెలు మృతి చెందగా, ఏడు గొర్రెలకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు మల్లేష్ తెలిపారు. కుక్కల దాడి వల్ల సుమారు రూ.50వేల నుంచి 70 వేల వరకు నష్టము వాటిలిందని బాధితుడు మల్లేష్ వాపోయాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. కాగా గ్రామంలో పెద్ద సంఖ్యలో ఉన్న కుక్కలు తరచూ గొర్రెలు, మేకల మందపై దాడులు చేస్తున్నాయని వాటి మీద కట్టేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



