Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురెండు ట్రాన్స్ఫార్మర్ ల ధ్వంసం

రెండు ట్రాన్స్ఫార్మర్ ల ధ్వంసం

- Advertisement -

దొంగలించిన కాపర్ వైర్, ఆయిల్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి దానిలో ఉన్న కాపర్ వైర్, ఆయిల్ ను దొంగలించినట్లు టిజిఎన్పిడిసిఎల్ ఏఈ పండరీనాథ్ తెలిపారు. ఈ నేపధ్యంలో ఏఈ పండరీనాథ్ తెలిపిన వివరాలు ప్రకారం గ్రామ శివారులోని ఎర్రకుంట ఏరియాలో బుధవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎర్ర గంగారంకు చెందిన ఎస్ఎస్ 220 నెంబర్, 16 కె.వి ట్రాన్స్ఫార్మర్, కొత్త ఎనుగు లక్ష్మణ్ కు చెందిన ఎస్ఎస్ 69 నెంబర్, 16 కె.వి ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి దానిలో ఉన్న కాపర్ వైర్ ను ఎత్తుకొని పోయినట్లు తెలిపారు. రైతులు ఉదయం ట్రాన్స్ఫార్మర్ ల వద్దకు వెళ్లేసరికి కింద పడి ఉండడం గమనించి సమాచారం అందజేశారన్నారు. గురువారం ట్రాన్స్ఫార్మర్లను లైన్మెన్ సాయిరాంతో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రైతులు వరి పంట వేశారని దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదించి అక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్లను త్వరలో పెట్టే విధంగా చర్యలు చేపడతామని పండరి నాథ్ వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad