- Advertisement -
నవతెలంగాణ- నిర్మల్‌టౌన్
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మంజులాపూర్ నుంచి నిర్మల్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనం గోల్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢకొీంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మంజులాపూర్‌కు చెందిన సృజన్(21), నటరాజ్‌నగర్‌కు చెందిన పృథ్విరాజ్(32) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. యువకులిద్దరూ ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



