ఓరెన్‌బర్గ్ : రష్యాలోని ఓరెన్‌బర్గ్ ప్రాంతాంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. కీవ్‌కు తూర్పు వైపు 1,700 కిలోమీటర్ల దూరం చొచ్చుకొచ్చి మరీ ఈ దాడి చేయడం గమనార్హం. ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి దాడులశక్తిని గణనీయంగా పెంచుకొన్నదనడానికి ఈ దాడి ఉదాహరణగా నిలిచింది. ఈ దాడి కారణంగా ప్లాంట్లలోని ఓ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వీటిని అదుపులోకి తెచ్చినట్టు ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. దాడి చోటుచేసుకొన్న ప్రదేశం జనావాసాలకు అతి దగ్గరగా ఉందని చెప్పారు.
రష్యాలోని సుదూర ప్రాంతాల్లో సైతం ఉక్రెయిన్ దళాలు డ్రోన్ల దాడులు చేస్తున్నాయి. గత నెల దాదాపు 2,000 కిలోమీటర్ల మేరకు లోపలకు చొచ్చుకొచ్చి దాడికి తెగబడ్డ ఘటనలున్నాయి. రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది సవాలుగా మారింది. సైబీరియా, ఊరల్ పర్వతాల్లో చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తాజాగా సమర రీజయన్‌లో కూడా డ్రోన్ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు మాత్రం ఇది చమురు రిఫైనరీని లక్ష్యంగా చేసుకున్నట్టు చెబుతున్నారు. కానీ, ఈ దాడిపై గవర్నర్ మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.
రష్యా గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES