Saturday, September 27, 2025
E-PAPER
Homeక్రైమ్మనవడి మరణాన్ని తట్టుకోలేక నాయనమ్మ గుండెపోటుతో మృతి..

మనవడి మరణాన్ని తట్టుకోలేక నాయనమ్మ గుండెపోటుతో మృతి..

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని పస్రా గ్రామంలో ఒక్కరోజులోనే రెండు మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన కొప్పనాతి వీరబాబు ప్రధమ కుమారుడు హర్ష సాయి (4) గురువారం సాయంత్రం గోవిందరావుపేటలో లారీ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. చిన్నారి మృతి గ్రామంలో విషాదాన్ని నింపగా, ఆ దుర్ఘటనను జీర్ణించుకోలేక హర్షసాయి నాయనమ్మ నీలమ్మ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై కన్నుమూశారు.ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనతో పస్రా గ్రామంలో విషాద వాతావరణం  తో నిండిపోయింది. బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -