Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅటు వెళ్లలేక.. గ్రామానికి రాలేక..

అటు వెళ్లలేక.. గ్రామానికి రాలేక..

- Advertisement -

– గణపతి విగ్రహం కోసం వెళ్లిన యువకులు
-వరద వల్ల మూడ్రోజులుగా పోచమ్మరాళ్ల తండాలోనే..


నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్‌
వినాయకుడి విగ్రహాన్ని కొనుక్కొచ్చేందుకు వెళ్లిన యువకులు భారీ వర్షాలు, వరదలతో మూడు రోజులుగా పోచమ్మరాళ్ల తండాలో చిక్కుకుపోయారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు సరిహద్దు జిల్లా అయిన మెదక్‌ జిల్లాకు వెళ్లారు. బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడం.. ఘన్పూర్‌ మండలం నాగపూర్‌ గేటు వద్ద వరదలో కారు కొట్టుకపోవడంతో అది చూసిన యువకులు తిరిగి ఇంటికి వెళ్లిపోదామని పోచమ్మరాళ్ల వరకు వచ్చారు. అయితే, పోచారం ప్రాజెక్టు నుంచి పొంగిపొర్లుతున్న వరద తాకిడికి రోడ్డు కోతకు గురికావడంతో ఇటు రాలేక.. అటు వెళ్లలేక పోచమ్మరాళ్ల తండా వద్దే యువకులు ఉండిపోయారు. రెండ్రోజులపాటు ఎటూ దారిలేక పోచమ్మరాళ్ల గ్రామపంచాయతీలోనే బస చేశారు. గ్రామస్తులు భోజనం పెట్టారు. శుక్రవారం యువకులను రెస్క్యూ టీం వరద దాటిద్దామని ప్రయత్నం చేసి విఫలమైంది. దాంతో యువకులకు ఘన్పూర్‌ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్లో పునరావాసం కల్పించారు. వరద ఉధృతి తగ్గగానే యువకులను స్వగ్రామానికి చేరుస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -