Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ గోదాముల ఆకస్మిక తనిఖీ

వ్యవసాయ గోదాముల ఆకస్మిక తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ 
మోపాల్ మండలంలోని బూర్గం (పి) మరియు మోపాల్ సొసైటీ పరిధిలో గల గోదాములో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మన జిల్లాలో యూరియా కొరత లేదని కాకపోతే రైతులందరూ నానో యూరియాని వాడాలని నానో యూరియా వాడినప్పుడు చీడపీడ వల్ల నుండి కూడా పంటకు రక్షణ కలిగిస్తుందని ఆయన తెలిపారు. కచ్చితంగా రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చిన తనను సంప్రదించాలని ముఖ్యంగా వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంటలకు కావలసిన సమాచారాన్ని రైతులకు అందజేయాలని కూడా వారికి తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లోని రైతులందరూ  రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి నెలలో నిర్వహించే శాస్త్రవేత్తలు సదస్సులకు హాజరై నూతన వంగడాల గురించి తెలుసుకోవాలని ఆయన కోరుతున్న వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -