- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం రుద్రారం గ్రామంలోని డిసిఎంఎస్ ఎరువుల దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్ లు,స్టాక్ బోర్డు లను,బిల్లు బుక్ లను పరిశీలించారు. ఎరువుల దుకాణాల ఎదుట తప్పనిసరిగా స్టాక్ బోర్డును, ధరల పట్టికను వినియోగ దారులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ఎరువుల వ్యాపారులను ఆదేశించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మహదేవపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీపాల్,మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రీజ పాల్గొన్నారు.
- Advertisement -