నవతెలంగాణ – సదాశివనగర్
తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్ నందు ఫైనాన్షియల్ లిట్రసి లో భాగంగా డాక్టర్ గణేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థులకు కింది విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు పొదుపు చేసుకోవాలని సూచించారు అనవసరమైన ఖర్చు లు చేయకూడదన్నారు. మనం సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేసి దాన్ని పెట్టుబడిగా పడితే భవిష్యత్తులో మరింత ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుందని సూచించారు. పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆ డబ్బు సహాయపడుతుందన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవచ్చు అన్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడగలరు అని సూచించారు మనకి ఇష్టమైన ఆస్తిపాస్తులను సంపాదించ వచ్చని సూచించారు.డబ్బును ఆన్లైన్ గేమ్స్ లో పెట్టి పోగొట్టకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే రాజారెడ్డి ఈ కార్యక్రమ ఇంచార్జ్ ఆర్ లక్ష్మి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఫైనాన్షియల్ లిట్రసిపై అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES