నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఐదో వార్డులో పురపాలక సంఘ చైర్మన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో చెత్త విభజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత తో పాటు పట్టణ పరిశుభ్రత ను కాపాడాలని కోరారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, చెత్తను వేరుచేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని తెలిపారు.
నీటి నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ , కౌన్సిలర్స్ బొలిశెట్టి రాజు, పిల్లి తిరుపతి , పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆర్ పి వాణి శ్రీ, అంగన్వాడీ టీచర్ తిరుమల, బసిల్ ఫౌండేషన్ సూపర్వైజర్ నవీన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.



