Thursday, January 8, 2026
E-PAPER
Homeకరీంనగర్ఉపాధి శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

జిల్లా స్కిల్ కమిటీ సభ్యుడు నాగిరెడ్డి రఘుపతి
నవతెలంగాణ – రాయికల్

ప్రతిమ ఫౌండేషన్, టాటా స్ట్రైవ్, జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువత కోసం అందిస్తున్న ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం జేఏసీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా స్కిల్ కమిటీ సభ్యుడు నాగిరెడ్డి రఘుపతి మాట్లాడుతూ.. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీ, సోలార్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ వంటి కోర్సులతో పాటు మహిళలకు ప్రత్యేకంగా కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, హోమ్ ఏయిడ్ హెల్త్ కోర్సుల్లో ఉచిత వసతి, భోజన సౌకర్యంతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల యువత పేరు నమోదు చేసుకోవడానికి 99633 47142 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు చింతకుంట సాయికుమార్‌, పాత్రికేయులు సింగిడి శంకర్, గుర్రాల వేణు, నాగమల్ల శ్రీకర్, శ్యాంసుందర్, లింబాద్రి, కిరణ్, విజయ్, జితేందర్, కృష్ణారెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -