Saturday, December 20, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ టాకింగ్‌ పెన్‌ ప్రాజెక్టుకు యునెస్కో ప్రశంస

కేరళ టాకింగ్‌ పెన్‌ ప్రాజెక్టుకు యునెస్కో ప్రశంస

- Advertisement -

మలయాళం , గిరిజన భాషల అభ్యసనం కోసం చర్యలు

తిరువనంతపురం: ”భాషా మ్యాటర్స్‌” నివేదికలో మాతృభాష అయిన మలయాళం , గిరిజన భాషలను వ్యాప్తి చేయడానికి కేరళ చేపట్టిన ప్రాజెక్టులను యూనెస్కో ప్రశంసించింది. మలప్పురం జిల్లాలో జన శిక్షణ సంస్థాన్‌ (జేఎస్‌ఎస్‌) ఉపయోగించిన ”టాకింగ్‌ పెన్‌” కూడా ఈ నివేదికలో చోటు సంపాదించుకుంది. భాషా మ్యాటర్స్‌ మాతృభాష, బహుభాషా విద్య కింద ”స్టేట్‌ ఆఫ్‌ ది ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా 2025”పై యూనెస్కో రూపొందించిన తాజా నివేదికలో కేరళ విద్యా రంగం సాధించిన ప్రగతికి ప్రత్యేక స్థానం లభించింది. మలప్పురంలో విద్యా కార్యక్రమం కింద జేఎస్‌ఎస్‌ ఈ టాకింగ్‌ పెన్‌ను ప్రారంభించింది. మలప్పురం జేఎస్‌ఎస్‌ డైరెక్టర్‌ వి. ఉమ్మర్‌కోయ మాట్లాడుతూ: ”టాకింగ్‌ పెన్‌ ప్రాజెక్టును 2015-17 మధ్య కాలంలో నిలంబూరు గిరిజన ప్రాంతంలో ఒక పైలట్‌ కార్యక్రమంగా అమలు చేశాం.

దీని ద్వారా 370 మంది మహిళలతో సహా 410 మంది గిరిజనులు లబ్ది పొందారు.”ఈ పెన్నులు ముద్రించిన మలయాళం పాఠాన్ని పణియ గిరిజన భాషలో బిగ్గరగా చదివి వినిపిస్తాయి, దీనివల్ల అభ్యాసకులు అక్షరాలు, పదాలు వినడానికి , గుర్తించడానికి వీలవుతుంది. 2018 నుంచి దీనిని ఒక సుస్థిర అభివృద్ధి జీవనోపాధి ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు.. ఇది ఆ 410 మంది ప్రజలు దరఖాస్తు ఫారాలను పూర్తి చేయడంలో తాము పొందిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి వీలు కల్పించింది.” మలప్పురం కాకుండా, తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిస్సూర్‌ , పాలక్కాడ్‌ జిల్లాల్లో కూడా జేఎస్‌ఎస్‌ ప్రారంభించబడింది. అయితే, రాజ్యసభ సభ్యుడు పీవీ అబ్దుల్‌ వహాబ్‌ ఆధ్వర్యంలో మలప్పురంలో మాత్రమే టాకింగ్‌ పెన్‌ ప్రాజెక్టు అమలైంది.ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఖర్చయింది. అయితే టాకింగ్‌ పెన్‌ ప్రాజెక్టు ద్వారా లబ్ది పొందిన గిరిజనులకు శిక్షణ సమయంలో ఆహారం అందించేలా అధికారులు చూసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -