Sunday, March 29, 2026
E-PAPER
Homeఖమ్మంగుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వరావుపేట
అశ్వారావుపేట మండలం గంగారం గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతుని వయస్సు సుమారు 60 సంవత్సరాల పైబడినట్లు పోలీసులు భావిస్తున్నారు.మృతుని కుడి చేతిపై “గోపాలస్వామి” అని పచ్చబొట్టు ఉండటం గమనార్హం.మృతుడు తెలుపు రంగు గళ్ళ చొక్కా, నలుపు రంగు నిక్కర్ ధరించి ఉన్నాడు.మృతదేహాన్ని పరిశీలించగా సుమారు రెండు నుండి మూడు రోజుల క్రితం మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

గ్రామస్థుల వివరాల ప్రకారం ఐదు రోజుల క్రితం వేదాంతపురం గ్రామ శివారులో మతిస్థిమితం సరిగా లేకుండా తిరుగుతూ ఈ వ్యక్తి కనిపించినట్లు తెలిసింది. మృతుని వివరాలు తెలిసిన వారు లేదా బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే అశ్వారావుపేట పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: అశ్వారావుపేట ఎస్సై – 8712682062, 8712682063

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -