Monday, January 26, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్నూర్ మండలంలో జంగంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని వద్ద గుర్తింపు పొందేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే అతని ఎడమ చేతిపై ‘Dabba’ అనే పదం ఇంగ్లీషులో వ్రాసి, పచ్చ బొట్టు ఉన్నట్లు గుర్తించారు.ఈ వ్యక్తిని ఎవరికైనా గుర్తుపడితే ఏమైనా సమాచారం ఉంటే వెంటనే కింద పేర్కొన్న నంబర్లకు తెలియజేయాలని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సంప్రదించవలసిన నంబర్లు ఎస్‌.ఐ.8712686154, సి‌.ఐ. భిక్నూర్ 8712686153 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -