Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంప్రయివేట్‌ ఆస్పత్రుల్లో ఏకీకృత షిఫ్ట్‌

ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో ఏకీకృత షిఫ్ట్‌

- Advertisement -

పడకల సంఖ్యతో సంబంధం లేకుండా…
ప్రతి కేటగిరీలోనూ అమలు చేయాలని కేరళ సర్కార్‌ ఆదేశం
ఇతర రాష్ట్రాలకూ ఆదర్శం : వైద్య ఉద్యోగ సంఘాలు

తిరువనంతపురం: కార్పొరేట్‌ ఆస్పత్రులే కాదు..చిన్న చితకా ప్రయివేట్‌ ఆస్పత్రుల్లోనూ ఉద్యోగులపై వేధింపులు, పనిగంటల విధానం ఇష్టా రాజ్యంగా ఉంటుంది. కాస్త ఆలస్యమైనా వేతనాల్లో కోతలతో యాజమాన్యాలు నానా ఇబ్బందు లకు గురిచేస్తుంటాయి. ఈ ఆస్పత్రులపై చర్యలకు ప్రభు త్వాలు వెనకాడుతుంటాయి. అయితే కేరళలోని ఎల్డీఎఫ్‌ సర్కార్‌ మాత్రం.. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తోంది. మరోవైపు ప్రయివేట్‌ ఆస్ప త్రులనూ గాడిలో పెడుతోంది. తాజాగా ప్రయివేట్‌ ఆస్పత్రి పడకల సంఖ్యతో సంబంధం లేకుండా, నర్సులతో సహా ప్రతి కేటగిరీ ఉద్యోగులకు ఏకీకృత షిఫ్ట్‌ వ్యవస్థను అమలు చేయాలని పినరరు ప్రభు త్వం ఆదేశించింది. అక్టోబర్‌ 18న ఉపాధి , నైపుణ్యాల శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మూడు-షిఫ్ట్‌ల వ్యవస్థను 100 కంటే ఎక్కువ పడకలు ఉన్న ఆస్పత్రు లకు పరిమితం చేసిన మును పటి నిబంధనను భర్తీ చేస్తుంది. ఈ నిర్ణయం ప్రయి వేట్‌ హెల్త్‌కేర్‌ రంగంలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఆర్డర్‌ కాపీని మంగళవారం మీడియాతో పంచుకున్నారు. వీరకమర్‌ కమిటీ, ప్రయివేట్‌ హాస్పిటల్‌ ఇండిస్టీ లైజన్‌ కమిటీ సిఫారసుల ఆధారంగా మునుపటి నిబంధన 2021లో ప్రవేశపెట్టబడింది. ఇది 100 కంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రయివేట్‌ ఆస్పత్రులలోని అన్ని వర్గాల ఉద్యోగులను మూడు-షిఫ్ట్‌ షెడ్యూల్‌కు – వరుసగా ఆరు గంటలు, ఆరు గంటలు నుంచి పన్నెండు గంటలు – హక్కును ఇచ్చింది. ఈ నియమం రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 48 గంటలు లేదా నెలకు 208 గంటలు దాటి పనికి ఓవర్‌ టైం చెల్లింపును కూడా నిర్ధారించింది. ఇప్పుడు ఈ వ్యవస్థను రాష్ట్రంలోని అన్ని ప్రయివేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం విస్తరించింది. పడకల సామర్థ్యానికి సంబంధించిన మునుపటి పరిమితిని తొలగించింది. రవాణా లేకపోవడం వల్ల ఇంటికి వెళ్లలేని సిబ్బందికి విశ్రాంతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని కూడా ఈ ఉత్తర్వు నొక్కి చెబుతుంది.కేరళలోని ప్రయివేట్‌ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లోని ఉద్యోగులకు న్యాయమైన పని పరిస్థితులు , స్థిరమైన షిఫ్ట్‌ నిర్మాణాలను నిర్ధారించడం ఈ నవీకరించబడిన ఆదేశం లక్ష్యమని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -