Monday, October 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐక్యతే సీఐటీయూ లక్ష్యం

ఐక్యతే సీఐటీయూ లక్ష్యం

- Advertisement -

ముగిసిన సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ 16వ మహాసభ
అన్ని రంగాల కార్మికులను కలవాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
43 మందితో నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-సిటీబ్యూరో
అనేక రంగాల్లోని కార్మికులను చేరుకోవడంలో మరింత కృషి పెరగాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ అన్నారు. సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ 16వ మహాసభ బంజారాహిల్స్‌లోని రాయల్‌ ఫంక్షన్‌ (కామ్రేడ్‌ జి.రఘుపాల్‌ నగర్‌ ప్రాంగణం)లో ఆదివారం ముగిసింది. సెంట్రల్‌ సిటీ కమిటీ మాజీ అధ్యక్షులు జె.కుమార స్వామి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో పాలడుగు భాస్కర్‌, జె.వెంకటేష్‌ మాట్లాడారు. అతిపెద్ద ట్రేడ్‌ యూనియన్‌గా సీఐటీయూ ఉన్నదని, కానీ ఏ యూనియన్‌లోనూ చేరని కార్మికులు అనేక మంది నగరంలో ఉన్నారని అన్నారు. వారందరినీ చేరేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మహాసభలో 43 మందితో నూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకున్నారు.

7 తీర్మానాలకు మహా సభ ఆమోదం
1. నాలుగు లేబర్‌ కోడ్స్‌లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
2. మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, కార్మికవర్గ ఐక్యతని నిలబెట్టుకుందాం.
3. రాంకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి, స్వచ్ఛ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
4. జీహెచ్‌ఎంసీ కార్మికుంలందరినీ పర్మినెంట్‌ చేయాలి, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి.
5. సమాజంలో మహిళలపై హింసను అరికట్టాలి. పనిప్రదేశాలలో మహిళ కార్మికులకు రక్షణ కల్పించాలి. లైంగిక వేధింపులు నిరోధక చట్టం(పీఓఎన్‌హెచ్‌) 2013ను అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థల కార్యాలయాల్లో పటిష్టంగా అమలు చేయాలి.
6. యూనివర్సిటీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
7. 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌ డ్రాఫ్ట్‌ కనీస వేతనాలు జీవోలను సవరించాలి. కనీస వేతనం 26వేలు నిర్ణయించాలి.

సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ నూతన కమిటీ ఎన్నిక
సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ నూతన కమిటీ 43 మందితో ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. 15మంది ఆఫీస్‌ బేరర్స్‌ని, 28 మంది కమిటీ సభ్యులను మహాసభ ప్రతినిధులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా ఎం.దశరథ్‌, కార్యదర్శిగా జె.కుమారస్వామి, కోశాధికారిగా అజయ్ బాబు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌గా డి.కిరణ్మయి, నగర ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేష్‌, వి.కామేష్‌ బాబు, సి.మల్లేష్‌, జి.రాములు, టి.మహేందర్‌, డి.కిరణ్మయి, సహాయ కార్యదర్శులుగా పి.శ్రీనివాస్‌, ఎస్‌.శ్యామలీల, టి.యాదమ్మ, ఏ.రాజు, జి.నరేష్‌, జూబ్లీహిల్స్‌ జోన్‌ నుంచి ఒక కో ఆప్షన్‌ ప్రకటిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    - Advertisement -
    RELATED ARTICLES
    - Advertisment -

    తాజా వార్తలు

    - Advertisment -