- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
బహుజనుల ఐక్యత వర్ధిల్లాలని మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం తెలంగాణలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసి,దక్కన్ రాజ్యంపై డిల్లీ పెత్తనాన్ని ధిక్కరించి, గోల్కొండ ఖిల్లాపై స్వతంత్ర బావుటా ఎగరవేసిన బహజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆగస్టు 18న సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెస్తున్నా సందర్భంగా ఆ మహానీయుడికి ఘన మైన నివాళులు అని తెలిపారు.
- Advertisement -