నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని హాస్టల్స్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పి డి ఎస్ యూ తెలంగాణ యూనివర్సిటీ నాయకులు కే.గౌతం రాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ డాక్టర్ మామిడాల ప్రవీణ్ కు తే.యూ పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ హాస్టల్స్ లో నాసిరకమైన చికెన్ సప్లై చేస్తున్నారని, చికెన్ టెండర్ ను వెంటనే రద్దు చేయాలని, దోమల బెడదను ఆరికట్టడానికి కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేయాలని, దోమల స్ప్రే కొట్టాలని, భోజనం లో పురుగులు వస్తున్నాయని నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని, కేర్ టేకర్ లను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలనీ, ఓల్డ్ మరియు న్యూ బాయ్స్ ,గర్ల్స్ హాస్టల్లో ట్యాప్స్ సింక్ పైపులు స్విచ్ బోర్డ్స్ మరమత్తులు చేయించాలీ, జిమ్ ఏర్పాటు చేయాలని,వాచ్మెన్ లకు టార్చ్ లైట్ లు ఇవ్వాలని ,సంవత్సరాలుగా పాతుకుపోయిన కూరగాయలు మరియు గ్రాసరి టెండర్లను రద్దుచేసి ఓపెన్ టెండర్ విధానాన్ని అమలు చేయాలని, హాస్టల్ పగుళ్లు ఏర్పడ్డాయనీ వెంటనే మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం కావున హాస్టల్ ను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తే యూ పి డి ఎస్ యూ నాయకులు గోపి, రాజేందర్, తిరుపతి, రాము తదితదిరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ హాస్టల్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES