Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర, జాతీయ స్థాయికి ఉప్పల్వాయి గురుకుల విద్యార్థులు 

రాష్ట్ర, జాతీయ స్థాయికి ఉప్పల్వాయి గురుకుల విద్యార్థులు 

- Advertisement -

కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ లో విద్యార్థుల ప్రతిభ 
నవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో ప్రతిభను చూపి రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపికైనట్లు మంగళవారం పిడి లింగం తెలిపారు. జనగామలో జరిగిన రాష్ట్ర సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో 9వ తరగతి విద్యార్థి హెచ్ శ్రీ రోహన్ జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 25న చెన్నై లో జరిగే పోటీల్లో పాల్గొని ఉన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి ఆనంద్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా ముక్కల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. వీరి ఇరువురిని ప్రిన్సిపాల్ ఎం శివరాం, వైస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పిటి రవీందర్లు అభినందించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -