మండల యూత్ ఉపాధ్యక్షుడు మహేష్
నవతెలంగాణ – పెద్దవంగర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతోనే కొరత ఏర్పడిందని యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ఆవుల మహేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి రావలసిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవ్వకుండా కుట్ర కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రైతులు యూరియా కోసం హరిగోస పడుతుంటే బీజేపీ నాయకులకు కండ్లకు కనబడటం లేదా…? అని ప్రశ్నించారు. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వాటా కింద రావాల్సిన యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES