డిఎఓ అంజిప్రసాద్..
నవతెలంగాణ -ముధోల్
రైతులు యూరియా తగిన మోతాదులో వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. మండలంలోని కారే గాం గ్రామంలోని రైతు వేదికలోశనివారం స్పిక్ , గ్రీన్‌స్టార్ ఆధ్వర్యంలో రైతుల కోసం ఏర్పాటు చేసినశిక్షణ సదస్సులో పాల్గొని మాట్లాడారు. యూరియాను తగిన మోతాదులో మాత్రమే వాడాలని సూచించారు .అధికంగా వాడితే నేల సారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. అలాగే రైతులు పంట మార్పిడి తప్పకుండా పాటించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.పంటల సంరక్షణ, ఎరువుల వినియోగం, ఆధునిక సాగు పద్ధతులపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రచన, హరికృష్ణ, ఎఇఓ ప్రవీణ్ ,స్పిక్ రీజినల్ మేనేజర్ శివ, పిఎసిఎస్ సిఈఓ సాయి రెడ్డి, మ్యాక్స్ చైర్మన్ నర్సారెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
యూరియా తగిన మోతాదులో వాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



