ఆరుగురు మృతి
వాషింగ్టన్ : కరేబియన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న బోటుపై అమెరికా దాడి చేసిందని, ఈ దాడిలో ఆరుగురు మరణించారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ శుక్రవారం తెలిపారు. ఈ ప్రాంతంలో సెప్టెంబరు మాసంలో ట్రంప్ ప్రారంభించిన మాదకద్రవ్యాల నిరోధక ప్రచారంలో భాగంగా ఈ దాడులు జరిగినట్లు ఆయన చెప్పారు. మాదకద్రవ్యాలను ఆ బోటు తీసుకెళుతోందని, మరణించిన ఆ ఆరుగురు నార్కో టెర్రరిస్టులని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆ బోటులో ఏం తీసుకెళుతున్నారనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలను హెగ్‌సెత్ చూపలేదు. సముద్ర జలాల్లో వున్న బోటుపై ఒక క్షిపణితో దాడి చేయడం వెంటనే అది పేలిపోవడం కనిపిస్తోన్న 20 సెకన్ల వీడియోను ఆయన పోస్టు చేశారు.
కరేబియన్ సముద్ర జలాల్లో బోటుపై అమెరికా దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



