నవతెలంగాణ – పాలకుర్తి
ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం రూ.18 లక్షల 4 వేల 55 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. శుక్రవారం ఆలయ కళ్యాణ మండపంలో కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఈవో చిందం వంశీ పర్యవేక్షణలో ఆలయ హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ 2025 అక్టోబర్ 9 నుండి 2026 జనవరి 1 వరకు సందర్శకులు హుండీలో వేసిన కానుకలను లెక్కించామని తెలిపారు. 85 రోజులకు 18 లక్షల నాలుగు వేలు ఆదాయం వచ్చిందని తెలిపారు. హుండీ లెక్కింపులో అమెరికా కరెన్సీ నోట్లు 13 (88డాలర్లు) వచ్చిన్నట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, ఆలయ సిబ్బంది. శ్రీసోమేశ్వర,రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు.



