Tuesday, January 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెనుజులా దేశం నుండి అమెరికా సైన్యాలు వైదొలగాలి

వెనుజులా దేశం నుండి అమెరికా సైన్యాలు వైదొలగాలి

- Advertisement -

సీపీఐ (ఎం-ఎల్) ప్రజా పంథా ఆధ్వర్యంలో ట్రంపు దిష్టి బొమ్మదగ్ధం
నవతెలంగాణ – ఆర్మూర్

దక్షిణ అమెరికా వెనిజులా దేశ సార్వభౌమాదికార నియమాలను ఘోరంగా ఉల్లాంఘిస్తూ వైమానిక దురాక్రమణ దాడులకు పాల్పడి దేశ అధ్యక్షుడు నికోలాస్ మధురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అత్యంత దుర్మార్గ, చట్టవిరుద్ధ పద్ధతుల్లో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వెంటనే వెనుజులా దేశం నుండి అమెరికా సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎం-ఎల్ ) ప్రజా పంథా సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఆ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీఐ (ఎం-ఎల్)  ప్రజా పంథా జిల్లా నాయకులు యం ముత్తెన్న, సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ లు మాట్లాడుతూ.. మూడో ప్రపంచ దేశమైన వెనుజులపై అమెరికా  సామ్రాజ్యవాద కుట్రలను ప్రపంచ దేశాలు ఖండించాలని అన్నారు. వెనుజులా దేశ ప్రజలచే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన దేశాధ్యక్షుడి పై, ఆయన కుటుంబంపై ఇలాంటి బెదిరింపులు, అరెస్టులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు, మానవ హక్కులకు, ఐక్య రాజ్య సమితి నియమ, నిబంధనలకు  దేశాల సార్వభౌమత్వాలను  ఉల్లంగించడమేనని అన్నారు.  

వెనిజులా ప్రజల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాదం రాజకీయ, న్యాయ, సైనిక మార్గాల్లో సాగిస్తున్న దాడులే ఇవి అన్నారు. చమురు వంటి సహజ వనరులపై ఆధిపత్యం కోసం ఒక దేశ నాయకత్వాన్ని నేరస్తులుగా ముద్రవేసి అరెస్టు చేయాలనుకోవడం ఆధునిక వలసవాద దురహంకారానికి నిదర్శనం అన్నారు.

వెనుజులా అధ్యక్షుడు మధురోపై జరిగిన వ్యక్తిగత దాడులు మాత్రమే కాదు—ఇవి మొత్తం వెనిజులా ప్రజలపై, వారి స్వాతంత్రంపై హక్కులపై జరిగిన దాడులని, ఇలాంటి చర్యలు వెనిజులా ప్రజల పోరాట సంకల్పాన్ని బలహీనపరచలేవని,

అంతర్జాతీయ సమాజం ఈ దుర్మార్గమైన అరెస్టు లను వెంటనే ఖండించాలని అన్నారు. వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని తక్షణమే అమెరికా ఆపాలని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, భారత ప్రభుత్వం కూడా సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటించాలని,

సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలిచే వెనిజులా ప్రజల పోరాటానికి భారత్ సమాజం మద్దతుగా నిలబడాలని అన్నారు. వెంటనే వెనుజులా దేశం నుండి అమెరికా వైమానిక బలగాలను వెనక్కి తీసుకోని, అరెస్ట్ చేయబడిన వెనుజులా అధ్యక్షుడు నీకోలాస్ మాదురో తో పాటు అతని భార్య సిలియా ఫ్లోరెస్ లపై పెట్టిన తప్పుడు కేసులను విరమించుకొని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు ఏపీ. గంగన్న యు .రాజన్న ఎస్. దుర్గా ప్రసాద్  ప్రజా సంఘాల   నాయకులు యం డి నజీర్  డి.నిఖిల్ ,రాజు లింబాద్రి, ప్రసాద్, నిమ్మల  నిఖిల్  జి అరవింద్ , పోశాన్న , వివేక్ , వినయ్, వెంకట్, ఫాజన్ లు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -