Wednesday, September 17, 2025
E-PAPER
Homeఖమ్మంఏకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను వాడండి..

ఏకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను వాడండి..

- Advertisement -

పర్యావరణ పరిరక్షణను కాపాడండి..
నవతెలంగాణ – మణుగూరు
ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను వాడాలని పర్యావరణ పరిరక్షణను కాపాడాలని పాఠశాల ప్రిన్సిపల్ ఎండి యూసఫ్ షరీఫ్ మంగళవారం తెలిపారు. మణుగురు ఎక్సలెంట్ హై స్కూల్ విద్యార్థులు  పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వయంగా ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాలు తయారు చేశారు. విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా మట్టి విగ్రహాలు వాడితే పర్యావరణానికి హాని కలగదని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటి కాలుష్యం కలిగిస్తాయని తెలుసుకున్నారు. చిన్న వయసులోనే పర్యావరణాన్ని కాపాడే అలవాటు పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.డి. యూసుఫ్  డైరెక్టర్  యాకూబ్ షరీఫ్ కరస్పాండెంట్ ఖాదర్  పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఎకో ఫ్రెండ్లీ గణేశ గ్రీన్ ఫెస్టివల్ అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -