నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న చిత్రం ‘వైభవం’. ఈనెల 23న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.
రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో, హీరోయిన్లుగా పరిచ యం కానున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేయబడిన ఎంతో మంది ప్రతిభా వంతులైన నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించ నున్నారు. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సెన్సార్ బోర్డ్ నుండి ఇటీవల కాలంలో అరుదైపోయిన క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించిందని మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘మంచి సినిమాలను ఆదరిచడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారన్న సంగతి మరో సారి ఈ చిత్రంతో నిరూపితమవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే మా సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని ఆశిస్తున్నాం’ అని దర్శకుడు సాత్విక్ తెలిపారు.
‘వైభవం’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES