- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేండ్లుగా ఆగమైన శాఖలను సీఎం తనకు కేటాయించారని అన్నారు. ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయన్నారు.
సోమవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది అదృష్టమో.. దురదృష్టమో తెలియదు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉంది. యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?’’అని అన్నారు. అంతకుముందు కరీంనగర్‌లో క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు.
- Advertisement -