Thursday, February 12, 2026
E-PAPER
Homeసినిమాప్రేమికుల రోజు కానుక

ప్రేమికుల రోజు కానుక

- Advertisement -

సుమంత్‌ ప్రభాస్‌ తాజాగా ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌కు ఫస్ట్‌ వెంచర్‌. వీక్ష్మ ప్రొడక్షన్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్‌ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్‌ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మేకర్స్‌ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా నుంచి హార్ట్‌ బ్రేక్‌ యాంథమ్‌ ‘ఓ మై గాడ్‌..’ను ఈనెల 14న రిలీజ్‌ చేయబోతున్నారు. వాలెంటైన్‌ డే సెలబ్రేషన్‌కి ఇది పర్ఫెక్ట్‌ ట్రీట్‌గా ఉండబోతుంది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -