నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..మహర్షి వాల్మీకి మన దేశానికి ఆదర్శప్రాయమైన మహానుభావుడనీ, కవిశ్రేష్ఠుడు, ఆధ్యాత్మిక ప్రబోధకుడు. ఆయన సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను రామాయణంలో రచించి సమాజానికి అందించారన్నారు. వాల్మీకి బోధనలు మనకు నీతి, సమానత్వం, సత్యనిష్ఠ జీవనానికి మార్గదర్శకాలు. ఆయన చూపిన ఆచరణాత్మక మార్గంలో నడవడం, ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే మహర్షి వాల్మీకి కి మనం నిజమైన గౌరవం నివాళి అర్పించినట్లవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డిపిఓ ఏ ఓ కె. లింగ నాయక్, రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ , డిపిఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES