- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ శ్రీధర్ రెడ్డి, స్థానిక ఎస్ ఐ శైలేందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సీ.ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. ఏ.పి.ఓ. ఇందిర మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఆవరణలో 500 మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి,గ్రామపంచాయతీ అసిస్టెంట్ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు, పాల్గొన్నారు.
- Advertisement -