Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్వనమహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

వనమహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చే పట్టిన వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యాల ను పూర్తి స్థాయిలో సాధించాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. బుదవారం మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కనకాయి వాటర్ ఫాల్ రాడ్డులోని కెనాల్ పై వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ వాతావరణ స మతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షిం చాలని తెలిపారు. అంతేకాకుండా గిర్నూర్ గ్రామస్తులు కెనాల్ పక్కనే ఉన్నా రోడ్డు బుడదమయంగా ఉండడంతో కనకాయి జలపాతానికి మరోవైపు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని కలెక్టర్ దృష్టికి  తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -