మండల తహశీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
దేశభక్తిని మరింతగా పెంపొందించే కార్యక్రమంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు నిర్వహించినట్లుగా మండల తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వందేమాతర గీతాన్ని ఆలపించారు. ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, భారత చరిత్రలో వందే మాతరం గీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా తహశీల్దార్ వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల ప్రజల్లో ఉత్సాహం గుండెల నిండుగా జాతీయ భావం నెలకొందని వెల్లడించారు. జాతీయ భావన, ఐక్యత, సామూహిక భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిటి శ్రీనివాస్,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం వందేమాతరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



