- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
శుక్రవారం రెంజల్ మండలం లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. పాడి పంటలు, సుఖసంతోషాలతో ఉండాలని, కోరుతూభక్తితో వరలక్ష్మి వ్రతాన్ని చేశారు. ఉదయమే కల్లాపు చల్లుకొని ఇంటిని శుభ్రం చేసి, పంచామృతాలతో నైవేద్యాన్ని సమర్పించి మొక్కుకున్నారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ వారు మనస్ఫూర్తిగా పూజలు చేశారు.
- Advertisement -