- Advertisement -
అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి కృషి..
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం అభివృద్ధి అధికారిగా వారణాసి కమలాకర్ బాధ్యతలను చేపట్టారు. పిట్లం ఎంపీడీవోగా పనిచేసి రెంజల్ మండలానికి నూతన ఎంపీడీవో బాధ్యతలను తీసుకున్నారు. మంచిర్యాల్ జిల్లాకు చెందిన ఆయన నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో బాధ్యతలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మండల ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -