Wednesday, October 1, 2025
E-PAPER
Homeసినిమా3డీ యానిమేషన్‌తో 'వాయుపుత్ర'

3డీ యానిమేషన్‌తో ‘వాయుపుత్ర’

- Advertisement -

మన చరిత్ర, ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో ‘వాయుపుత్ర’ చిత్రం 3డీ యానిమేషన్‌తో రూపొందుతోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర ప్రొడక్షన్స్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. హనుమంతుని కాలాతీత కథను గొప్ప దశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -