Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా విబిఎస్ఎ 2025 బిల్లు

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా విబిఎస్ఎ 2025 బిల్లు

- Advertisement -

వర్సీటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే కుట్రలు
ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్
ఎఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ

కేంద్ర బీజేపీ సర్కారు విబిఎస్ఎ 2025 బిల్లు తీసుకువచ్చి, కేంద్రం తన సొంత ఎజెండాను వర్సీటీలలో అమలుపరిచేందుకు కుట్రలు చేస్తుందని, వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్(విబిఎస్ఎ) బిల్లు -2025 పేరుతో యూనివర్శీటీలను దెబ్బతిసి ఉన్నత విద్యకు పేద వర్గాలను దూరం చేస్తోందని, విబిఎస్ఎ బిల్లు, యూజీసీ నూతన మార్గదర్శకాలు రాజ్యంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ లు డిమాండ్ చేశారు.

శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోనెరెడ్డి కళ్యాణ మండపంలో 3వ రోజు జరుగుతున్న ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు మహాసభలకు ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బానోత్ రాఘురాం, బొజ్జు జ్యోతి ల అధ్యక్షత వర్గంగా వహించారు. ఈ మహాసభల ముఖ్య అతిధులుగా ఎఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర నాయకులు ఈటి నర్సింహ, విశిష్ట అతిథులుగా ఎఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ సిరంగ రాజ్, ఎఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్, జాతీయ నాయకులు బందెల నాసర్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ సిరంగ రాజ్ మాట్లాడుతూ దేశంలో 12 యేండ్లు కాలంగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ దేశ విద్యా రంగాన్ని కార్పోరేట్, మతోన్మాద విధానాలు అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తుందని విమర్శించారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిలో భాగమే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తూ జాతీయ విద్యా విధానం పేరుతో విద్య కాషాయికరణకు పూనుకున్నారని ఆరోపించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, దేశ విద్యా రంగాన్ని కార్పోరేట్, మతోన్మాద విధానాలు అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తుందని విమర్శించారు. దేశంలో ప్రభుత్వ పాఠశాలలను 93,000పైగా మూసివేసి ప్రభుత్వ పాఠశాల విద్య కూడా పేదలకు అందకుండా చేస్తోందని, బిజెపి పరిపాలన చేస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్విర్యం చేస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్ బిల్లు -2025 పేరుతో యూనివర్శీటీలను దెబ్బతిసి ఉన్నత విద్యకు పేద వర్గాలను దూరం చేస్తోందని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్, విదేశీ యూనివర్శీటీలను అనుమతిస్తూ ప్రభుత్వ విద్యలో ఫీజులు పెంచి అందరికి అందుబాటులో లేకుండా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారత దేశంలో 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ అని, దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై నిరంతర విద్యార్థుల పక్షాన నిలుస్తూ ఉద్యమాలు చేస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం విద్యార్థుల తరగతి గదుల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతూ విద్యార్థులను రాజకీయంగా ఓట్ల కొరకు వాడుకుంటున్నారని, తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న తెలంగాణ విద్యార్థులకు కేంద్రం నుండి తీసుకు వచ్చిందేమీ లేదని మండిపడ్డారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పాలక వర్గాలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం వారి పాలనలోనే అర్థం అవుతుందని అన్నారు.

ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్య కార్పొరేటికరణ, విద్య కేంద్రీకరణ, కాషాయికరణ చేయాలని చూస్తుందని, విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని, పాలకులు ప్రపంచ బ్యాంక్ సలహాలపై ఆధారపడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం’ అనే పద్ధతిలో విద్యావ్యాపారానికి పచ్చ జెండా ఊపయాని అన్నారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియాంబర్స్ మెంట్ 9,300 కోట్ల రూపాయలు బకాయిల విడుదల విషయంలో, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులకు బకాయిలు ఇంత వరకు చెల్లించకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదలపై ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కూడా గ్యారంటీ లేకపోవడం విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు.

ఈ మహాసభల్లో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు మారయ్య గౌడ్, ప్యాట్రన్ రాజినికాంత్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పి.సుధాకర్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటుకెల రామకృష్ణ, రఘురాం, గ్యార నరేష్ రహమాన్, నాగజ్యోతి, గ్యార క్రాంతి, లెనిన్, రాజు, ప్రవీన్, ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా సహాయ కార్యదర్శి కువాల్, కార్తీక్, కోశాధి కారి అనూష, నాయకులు హాసిని, కిషోర్, నిఖిల్, గౌతం, దిలీప్, ప్రవీన్, సోను, రాజ్, ఆకాష్, కృతిక్ విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -