నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నాగాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు నూతన అధ్యక్షులు కంపదండి తిరుపతి ఆధ్వర్యంలో ఎస్ఐ అనిల్ రెడ్డిని కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో గ్రామ అభివృద్ధి కమిటీల సహకారం ఎంతో అవసరమన్నారు.
నేరాల నియంత్రణకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి సహకరించాలన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపిన ఎస్ఐ నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు మోకినిపల్లి సురేష్, కోశాధికారి ఏముగంటి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు బసకొండ శ్రీనివాస్, ఈర్నాల బాబురావు, గడ్డం గోవర్ధన్, చెట్లపల్లి విట్టల్, రాథోడ్ సాగర్, పార్వతి రాజేష్, ముద్దుల హరీష్, చిడబోయిన రవికుమార్, శ్రీరాముల శ్రీనివాస్, ధోన్ పాల్ రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.



