- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మార్కెట్లో మంగళ, బుధ వారాల్లో కూరగాయలు, ఆకుకూరల ధరలు భగ్గుమన్నాయి. వినాయక చవితి పేరుతో మార్కెట్ నిబంధనలను అతిక్రమించి ధరలు రెట్టింపయ్యాయి. సామాన్యులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. వినాయక పర్వదినం పేరిట ఇవేమి ధరలు బాబోయ్.. అంటూ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అమాంతం పెరిగిన ధరలతో పచ్చిమిర్చి కిలో రూ.100,టమాటా రూ.55, బీరకాయ రూ.80, చిక్కుడు రూ.80,గోరు చిక్కుడు రూ.60, క్యాబేజీ రూ.40, కంద రూ.60, బెండకాయ రూ.60, కాకరకాయ రూ.60, ఫ్లవర్ రూ.80,వంకాయ రూ. 60, క్యారెట్ రూ.80లకు విక్రయించారు. బిన్నీస్ రూ.110 నుంచి రూ.220లకు, ఆలుగడ్డ రూ.40, దోసకాయ రూ.60, దొండకాయ రూ.60కి విక్రయించారు.
- Advertisement -