రూ.10 లక్షల పూచీకత్తుపై విడుదల
కర్నూలు: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢకొీట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ లొసుగులున్నాయని.. సీటర్ వాహనాన్ని స్లీపర్‌గా మార్చినట్టు ఆరోపణలున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఏ-1 అయిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు.
రూ.10వేల పూచీకత్తుపై విడుదల
వి. కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌కుమార్ విడుదలయ్యారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ఏ2గా ఉన్న ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు.. కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రూ.10 వేల సొంత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేసింది. ఈ మేరకు మెజిస్ట్రేట్ అనూష ఆదేశాలిచ్చారు.



