వెనిజులా ప్రతిపక్ష నాయకురాలికి నోబెల్‌ను వ్యతిరేకిస్తూ..
ట్రంప్‌నకు అంకితమిస్తానన్న మచాడో
కారకస్ : నార్వేలో దౌత్య కార్యాలయం మూసివేస్తున్నట్టు వెనిజులా ప్రకటించింది. ఈ విషయాన్ని వెనిజులా విదేశాంగ మంత్రిత్వశాఖ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అలాగే, జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియాలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు వెనిజులా ప్రభుత్వ నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ విషయాల్లో తమ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ.. వెనిజులాతో చర్చలను తాము కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా పనిచేస్తుందని వివరించింది. అలాగే, నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని వెనిజులాలో ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనిజులాలోని ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. అయితే వెనిజులాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, మదురో ఎన్నికను అమెరికాతో సహా పలు దేశాలు గుర్తించలేదు. మచాదోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే దౌత్య కార్యాలయం మూసివేయడం గమనార్హం. అయితే తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అంకితమిస్తున్నట్టు మచాడో ప్రకటించడం విశేషం.
నార్వేలో వెనిజులా దౌత్యకార్యాలయం మూసివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES