Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వైభవంగా వెంకటగిరి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం

వైభవంగా వెంకటగిరి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి  : మండలంలోని వెంకటాపురం గ్రామంలోని స్వయంభు వెంకటగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వంశపారంపర్య పౌరోహితులు రమాకాంత్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారిని, స్వామి వారిని ఎదురుకోలు కార్యక్రమాన్ని నిర్వహించి కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి వేద బ్రాహ్మణులు వేదమంత్రోచరణాలతో కళ్యాణ తంతును కమనీయంగా నిర్వహించారు.అనంతరం అమ్మవారికి భక్తులు ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం శ్రీ రామ భక్త భజన మండలి మల్లాపురం, శ్రీ శివరామకృష్ణ భజన మండలి వేల్పు పల్లి వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం, స్వామి వారి సేవ, ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ యాదగిరిగుట్ట వారి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కల్లూరి వాసుదేవ రెడ్డి, గుంటి మహేష్ యాదవ్, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, వేముల దశరథ, పల్లెపాటి కరుణాకర్, చంద్రహాస్, కొండపాక మహేష్, కర్రే రాజ్ కుమార్, ఉపేందర్, కరుణాకర్, చిలువేరు రవి ,చిన్న నరసింహారెడ్డి, ఆరుట్ల ఉదయ్ రెడ్డి, అన్నదాతలు కల్లూరి జగన్మోహన్ రెడ్డి, కల్లూరి సతీష్ రెడ్డి ,గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad