– కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు
నవతెలంగాణ -పరకాల : కుంకుమేశ్వర స్వామి దేవస్థానం భూమికి సంబంధించిన కోర్టు వ్యవహారంలో టిఆర్ఎస్ పార్టీగానీ, కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు కృషి గాని ఏమీ లేదని కా ఆలయ చైర్మన్ కోలుగూరి రాజేశ్వరరావు అన్నారు. శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాజేశ్వరరావు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు ఇటీవల అందిన కోర్టు తీర్పు కాపీలు పట్టుకొని తానేదో సాధించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కుంకుమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూమి ప్రస్తుత పశువుల సంత స్థలం ఏదైతే ఉందో అట్టి భూమిపై 1984 నుంచి వివాదం నడుస్తుందన్నారు.
అందుకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తానే కేసును ముందుకు తీసుకుపోవడంలో సరైన ఆధారాల్ని సేకరించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు రాజేశ్వరరావు వెల్లడించారు. గతంలో 2004 నుంచి 2006 వరకు తాను గుడి చైర్మన్ గా కొనసాగిన కాలంలో తనతో పాటు ధర్మకర్తల మండలి రెవెన్యూ అధికారుల వెంటపడి సరైన భూ రికార్డులను సేకరించడం, గవర్నమెంట్ ప్లీడర్లకు అందించడం ద్వారా ప్రస్తుతం కేసు కోర్టులో నెగ్గడానికి బలం చేకూరిందన్నారు.అంతేకాకుండా గతంలో పశువుల సంతా నగర పంచాయతీ నిర్వహిస్తున్న క్రమంలో ఎలాంటి ఆదాయం ఉండేది కాదన్నారు. ఆ క్రమంలో జనగామ జిల్లాకు చెందిన నవాబుపేటలో పశువుల సంత గుడిమాన్యంలో కొనసాగుతుందని తెలుసుకొని దాని జీవో ఆధారంగా పరకాలలో సైతం ఒకటి నగర పంచాయతీ తో కొట్లాడి పశువుల సంతకు నెలకు 2000 ఆదాయం వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు.
అట్టి ఆదాయం నేడు సంవత్సరానికి 5 లక్షలు రావడానికి అప్పటి ఈవో, తాను ధర్మకర్తల మండలి ఎంతో కృషి చేసినట్లు రాజేశ్వరావు వెల్లడించారు. గుడి భూమి వ్యవహారంలో దానికి రెవెన్యూ సమకూర్చడంలో కృషి చేసిన వాళ్లను వదిలేసి తామె అంత చేస్తున్నామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా గుడికి సంబంధించిన భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, రోడ్డు నిర్మాణానికి కారకుడైన వ్యక్తులే కోర్టు భూమి కాపాడా మంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో వెంకటయ్య, ప్రధాన అర్చకులు కోమాళ్ళ నాగభూషణ శర్మ, ధర్మకర్తలు తోట రవి, గౌరీశెట్టి నవీన్, ప్రజాపత్ శ్యామల రాము, గోవిందా సంధ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు