కార్పోరేట్ కంపెనీలు ప్రభుత్వాలు తయారు చేసే చట్టాలను ఉపయోగించి నిరర్దక ఆస్తుల రూపంలో బ్యాంకుల ద్వారా ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ(ఐబీసీ) కోడ్ అమలైన తర్వాత రాని బాకీలను మొండి బాకీలు/నిరర్దక ఆస్తుల గుర్తించే సమయాన్ని 180 రోజుల నుండి తొంభై రోజులకు తగ్గించుకున్నారు. రాని బాకీలుగా తేలగానే ఎర్పాట్లను(ప్రొవిజన్లను) మినహాయించుకుని, హెయిర్ కట్/డౌన్ సైజింగ్ అనే పద్ధతుల ద్వారా ఖాతాను సెటిల్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎందుకు ప్రోత్సహిస్తోందంటే బ్యాంకులన్నింటి నిరర్దక ఆస్తుల నిష్పత్తి తక్కువగా ఉంటే అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థకు మంచి మార్కులు పడతాయి. వెరసి నష్టపోయేదెవరంటే బ్యాంకుల్లో బుద్దిగా పుదుపు చేసుకున్న మధ్యతరగతి ప్రజలు మాత్రమే! ”ప్రొవిజనింగ్ పెట్టడటం వల్ల బ్యాంకు లభాలు తగ్గి వాటాదారులకే తక్కువ లాభాలు వస్తాయి, ప్రజలకేంటి నష్టం” అని కొందరు వాదిస్తారు. ప్రొవిజనింగ్ పెట్టకపోతే ఖాతాదారులకు వడ్డీ రేట్లలో పెరుగుదల వుతుందిగా! బ్యాంకుల వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే దాని పర్యవసాన ప్రభావం చాలా రంగాలపై సానుకూలంగా ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే ఈ ఎన్‌పిఎలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ప్రయివేటు బ్యాంకులు అందులో పాలు పంచుకుంటున్నాయి. ఎందుకంటే తద్వారా కార్పోరేట్లకు లాభం చేకూర్చడమే కాకుండా బ్యాంకుల బ్యాలన్స్‌షీట్ కూడా మెరుగవుతది కాబట్టి.
ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి క్వార్టర్ (క్యూ1)లో యాక్సిస్ బ్యాంక్ మొండి బకాయిల పెరిగాయి. నాసిరకం రుణాలకు (ప్రొవిజనింగ్) కేటాయింపులు చేయడం కారణంగా మొండి బకాయిలు ఊహించని విధంగా పెరిగాయని అంటున్నారు. దీంతో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం నాలుగు శాతంతగ్గి 5,806 కోట్లకు చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్‌ఎన్‌పిఎ గుర్తింపు ఫ్రేమ్‌వర్క్ నియంత్రణ అంచనాలకు తగ్గట్టుగా కనిపించినప్పటికీ ఈ సమస్య ఏ విధంగానూ ఇండస్‌ఇండ్ బ్యాంక్ కేసుతో పోల్చదగినది కాదని ఆర్ధిక నిపుణులు వాదిస్తున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇటీవల సిఇఓ, డిప్యూటీ సిఇఓతో సహా అనేకమంది తప్పుకున్న విషయం తెలిసిందే. ఇండస్ బ్యాంకు సంక్షోభానికి వరుస అకౌం టింగ్ లోపాలని ఆర్బీఐ అంచనాకు వచ్చింది. ఆ మధ్య యెస్ బ్యాంక్ కొంచెం గందరగోళంలో పడితే స్టేట్‌బ్యాంక్ దానికి ఊతమిచ్చింది. ప్రయివేటు బ్యాంకుల్లో జరుగుతున్న పరిణామాలు ఆకస్మాత్తుగా వచ్చినవి కాదు. గత ఆర్థిక సంవత్సరం మూడవ క్వార్టర్‌లో ఎన్‌పిఎల పెరుగుదల, తగ్గుతున్న మార్జిన్లు ప్రయివేటు బ్యాంకుల ఆదాయ వఅద్ధిని దెబ్బతీశాయి. మార్చి 31, 2025 నాటికి మొత్తం స్థూల ఎన్‌పిఎలు 2.3 శాతం (స్థూల అడ్వాన్సులలో) తక్కువగా ఉన్నాయి, ఇది ఏడాది క్రితం 2.8 శాతంగా ఉంది, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పిఎలు మార్చి 2024లో 3.7 శాతం నుండి మార్చి 2025లో 2.8 శాతానికి గణనీయంగా తగ్గాయి. ప్రయివేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్ పిఎ నిష్పత్తి 2.8 శాతం వద్ద స్థిరంగా ఉంది, విదేశీ బ్యాంకుల ఎన్‌పిఎలు 1.2 శాతం నుండి 0.9 శాతానికి తగ్గాయి. అయితే భారతీయ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాం కుల (ఎస్‌సిబిల) ఆస్తి నాణ్యత మెరుగుపడుతూనే ఉంది, స్థూల, నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) నిష్పత్తులు కనిష్టస్థాయిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక తెలిపింది.
ఇదిలా ఉంటే దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరో ఐదు బ్యాంకుల్లో వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్యూఐపీ, ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ. 45 వేల కోట్ల మేర వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం. వీటితో పాటు ఐడీబీఐ బ్యాంకు ప్రయివేటీకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోని ఉద్యోగులు పోరాట జెండాను ఎగరేసి ఈ ఆగష్టు మాసంలో సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ దేశాభివృద్ధిని వెనుక బాట పట్టించడమేగాక, ప్రజల కష్టార్జితాన్ని, విలువైన పొదుపును ప్రయివేటు వారికి, కార్పొరేట్లకు అప్పగించడం అవుతుంది. రాజకీయ పలుకు బడి కలిగిన ప్రముఖులు,కార్పొరేట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు భారీగా ఎగ్గొట్టడం వల్ల మాత్రమే, ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాలు వస్తున్నాయి. గత పదేండ్లలో ప్రభుత్వ బ్యాంకుల 16 లక్షల కోట్ల రూపాయల పారు బకాయిలను మాఫీ చేశారు. ప్రభుత్వ బ్యాంకుల పాత బకాయిల్లో 74శాతం హెయిర్ కట్ చేస్తున్నారు. ‘హెయిర్ కట్’ పేరుతో భారీ బకాయిలు పడిన సంస్థలను అతితక్కువ మొత్తం చెల్లించి బడా గుత్తసంస్థలు చేజిక్కించుకోగలు గుతున్నాయి. విడియోకాన్, భూషణ్ స్టీల్ కంపనీల వ్యవహారాలే అందుకు ఉదాహరణలు.
రైల్వేల తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పించేది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం. దేశంలో పెద్దఎత్తున వ్యవ సాయరంగానికి రుణాలిచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్నది ప్రభుత్వ బ్యాంకులే. చదువుకున్న, వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాల వ్యక్తులకు రిజర్వేషన్ల ద్వారా ఉపాధి, ఆర్థికసాయం కల్పిస్తున్నది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగమే. ఫైనాన్షియల్ ఇంక్లూసన్ పేరుతో యాభై కోట్లపై చిలుకు ‘జన్‌ధన్’ ఖాతాలను తెరిచింది ప్రభుత్వ బ్యాంకులే. కేంద్రప్రభుత్వం నిర్వహించమన్న సామాజిక పథకాలను కేవలం ప్రభుత్వ రంగమే నిర్వహిస్తోంది. ప్రధాన మంత్రి పేరు మీద ఉన్న జీవన జ్యోతి బీమా యోజన, జనశ్రీ బీమా యోజన పథకాలలో ఎల్‌ఐసి, ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల భాగ స్వామ్యం 96శాతం ఉంటే, ప్రయివేటు బీమా సంస్థల భాగస్వామ్యం కేవలం నాలుగు శాతం మాత్రమే. జన్ ధన్ యోజన పథకంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 97శాతంఉంటే, ప్రయివేటు బ్యాంకుల వాటా కేవలం మూడు శాతం. ప్రజోపయోగ కార్యకలాపాల్లో తక్కువ భాగస్వామ్య మున్న ప్రయివేటు బ్యాంకులు నిరర్దక ఆస్తులను రైట్ ఆఫ్ చేసుకునే అవకాశమిస్తే కార్పోరేట్, రాజకీయాల కుమ్ముక్కుకి ప్రయివేటు బ్యాంకులు బాగా ఉపయోగపడగలవు!
– జి.తిరుపతయ్య డ పి.సతీష్
నిరర్దక ఆస్తుల రూపంలో నిలువు దోపిడీ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES