Wednesday, August 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు..

సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలోని పీఏసీఎ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు  పాల్పడిన నిర్వాహకురాలు పన్నాల ఉమా రాణి, ట్యాబ్ ఆపరేటర్  పబ్బతి శేఖర్, సహాయకులు బాలకిషన్ పై మంగళవారం  క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయం పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.  సంగెం ధాన్యం కొనుగోలుకు  సంబంధించి దస్తావేజులను , రికార్డులను అధికారులు పరిశీలించారు. జిల్లా అధికారుల వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కాగా సంగెం ధాన్యం కొనుగోలు నిర్వాహకురాలు  పన్నాల ఉమా రాణి, ట్యాబ్ ఆపరేటర్  పబ్బతి శేఖర్, సహాయకులు బాలకిషన్ పై ఇటీవల జిల్లా అధికారుల ఫిర్యాదు మేరకు వలిగొండ పోలీసులు మంగళవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు.  శేఖర్, బాల కిషన్ లు నేరాన్ని ఒప్పుకోవటం తో వారిని పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కి తరలించారు. కాగా ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన  ప్రధాన నిందితురాలు ఉమా రాణి పరారీలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -