Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంటీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

- Advertisement -

చెన్నై : తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన స్పెషల్‌ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కౌన్సిల్‌ సభ్యులు తీర్మానం కూడా చేశారు. కాగా, 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తమిళనాడు స్థాపించిన టీవీకే పార్టీ కూడా బరిలో దిగనుంది. ఈ ఎన్నికల దృష్ట్యానే ముందుగానే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ ని ప్రకటించారు. ఇప్పటివరకు డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే పోటీ జరుగుతూ వస్తోంది. ఈ పార్టీలతో టీవీకే ఈ ఎన్నికల్లో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -