- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూర్ లో నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గమునకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు /మండల విద్యాశాఖాధికారి ఎం.నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా .పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి మీ పూర్తి సహకారం అందించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మగ్గిడి సూర్య మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి మా వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.ఇ కార్యక్రమంలో అధ్యాపక బృందం, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -