సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవంలో సర్పంచ్
నవతెలంగాణ – మద్నూర్
ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పెద్ద షక్కర్గా సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ అన్నారు. ఆ గ్రామంలో ఐదు లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం పనులను సర్పంచ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వ హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సారథ్యంలో పెద్ద షక్కర్గా గ్రామ అభివృద్ధికి కృషి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్ ,దేవిదాస్ పటేల్, సంగయ్యప్పలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే గ్రామాల అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



