బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయం వరకు చేరుకున్న మహిళా మణులు
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈనెల 13న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించాలన్న సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండగకు నేటి నుండి మహిళలు బోనాలను ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యంగా అర్పించారు. నగరంలోని ఆర్య నగర్ లోని మహాలక్ష్మి ఆలయంలో పోతరాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్ళ మధ్య మహిళా మణులు అమ్మవారి ఆలయం వరకు చేరుకుని అక్కడ అమ్మవారికి అర్పించారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తి శ్రద్దల మధ్య దేదీప మాన్యంగా ఆనందోత్సవాల మధ్య మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కాగా లక్ష్మీ సిల్క్స్ వస్త్ర షోరూమ్ అధినేత శీతల్, పాాండు, స్థానిక కార్పొరేటర్ లింగం, లావణ్య, స్థానిక మహిళలు, ఆరోగ్య రక్ష మహిళల యోగా కేంద్రం అధినేత ఐశ్వర్య ఆధ్వర్యంలో కార్యక్రమం ఎంతో ఘనంగా చేపట్టారు. అనంతరం వారు చివరగా అమ్మవారికి హారతి అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ లో మొదలైన ఊర పండగ ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES