Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గామాత ఉత్సవాలకు గ్రామాలు సిద్ధం..

దుర్గామాత ఉత్సవాలకు గ్రామాలు సిద్ధం..

- Advertisement -

అందంగా ముస్తాబైన నాయిన వానికుంట
భక్తి శ్రద్దలతో దుర్గామాతకు పూజలు
నవతెలంగాణ – పెద్దవూర
దుర్గామాత ఉత్సవాలకు మండలం లోని అనేక గ్రామాలు, సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటినుంచి సమీపిస్తున్నందున, దేవాలయాలు, మండపాలు అలంకరించబడుతున్నాయి. దేవతా విగ్రహాల రూపకల్పనలో కళాకారులు నిమగ్నమై ఉన్నారు, అలాగే మతపరమైన వేడుకల కోసం వివిధ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామాల్లో దుర్గామాత కోసం ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, వాటిని రంగులద్దడం, విద్యుద్దీపాలతో అలంకరించడం వంటి పనులు జరుగుతున్నాయి. గ్రామ దేవతలను గౌరవించే ఉత్సవాలలో భాగంగా కొన్ని గ్రామాల్లో బోనాలు, ఎండ్ల బండ్ల ఊరేగింపు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

నేటి నుంచీ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోనుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.దీంట్లో భాగంగా మండలంలోని నాయినవాని కుంట,పర్వేదుల,ఉట్లపల్లి,పులిచర్ల గ్రామాల్లోలో ఆదివారం మండపాలను ముస్తాబు చేశారు.యువత మాలధారణ చేసి నియమనిష్టలతో అమ్మవారిని కొలిచి ప్రత్యేక పూజలు చెయనున్నారు.దేవి శరన్నవరాత్రి ఉత్స వాల కోసం దుర్గామాత మండపాలను నిర్వహకులు ముస్తాబు అందంగా ముస్తాబు చేశారు.దుర్గామాత అమ్మవార్లను మండపాల్లో ప్రతిష్టించి 9 రోజుల పాటు భక్తితో పూజించనున్నారు.నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి విగ్రహాల ప్రతిష్టాపనకు. మండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.దీంతో ఆయా గ్రామాలలో నేటి దుర్గామాతా పూజలు, బాండియా ఆటలతో పండగ వాతావరణం నెలకొననుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -