ఎన్టీఆర్‌తో ‘దేవర’ వంటి చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ మరో భారీ సినిమాను రూపొందించటానికి సిద్ధమైంది. విశ్వక్ సేన్ హీరోగా, నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రొడక్షన్‌లో నెం.3 అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి, స్క్రిప్ట్‌ను అందించారు.
ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు రజత్ దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా, తేజస్ కష్ణ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. రైటర్స్ భాను భోగవరపు, నందు సవిరగాన డైలాగ్స్ రాస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
‘విశ్వక్‌సేన్ ఇప్పటివరకు చేసిన సినిమాలు, పాత్రలకు పూర్తి భిన్నమైన చిత్ర మిది. ముఖ్యంగా ఆయన పోషించబోయే పాత్ర అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని చిత్రయూనిట్ తెలిపింది.
విశ్వక్‌సేన్ కొత్త సినిమా మొదలైంది
- Advertisement -
- Advertisement -



